ఎంతో హెల్దీ అయిన ఉసిరిని పిల్లలు తినట్లేదా
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:15 PM

ఉసిరికాయలు చాలా మంచివి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే, సీజన్ వస్తే కచ్చితంగా దీనిని తీసుకొచ్చి తింటుంటారు. అయితే, వీటిని తినడానికి కాస్తా రుచి వేరుగా ఉండేసరికి పిల్లలు అంతగా ఇష్టపడరు. పక్కనపెట్టేస్తారు. అలాంటి పిల్లల చేత ఉసిరిని ఎలా తినిపించాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ ప్రాచి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కొన్ని వంటకాల్ని షేర్ చేస్తున్నారు. అలా చేసి పెడితే పిల్లలు వద్దనుకుండా ఉసిరిని ఎంజాయ్ చేస్తారు. మరి ఆ వంటకాలేంటో చూసేయండి.


ఉసిరి, బీట్‌రూట్ కట్‌లెట్స్


2 టేబుల్ స్పూన్ల ఉసిరి తురుముని అరటీస్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వేయించండి. అందులోని కొద్దిగా పసుపు వేయండి. తర్వాత అరకప్పు ఉడికించిన బీట్‌రూట్ ముక్కల్ని మెత్తగా చేసి వేయండి. పావు కప్పు ఉడికించిన బంగాళాదుంపని కూడా మెత్తగా చేసి వేయండి. 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రంబ్స్ వేయండి. అందులోనే ఉప్పు, కొద్దిగా పసుపు వేయండి. వీటిని కట్‌లెట్‌లా చేయండి. తర్వాత 1 టీస్పూన్ నెయ్యి వేసి రెండు వైపులా ఫ్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇష్టంగా తింటారు.


బీట్‌రూట్ ఆమ్లా జ్యూస్


ముందుగా అరకప్పు బీట్‌రూట్‌ని అరకప్పు క్యారెట్, 1 ఉసిరిని, పావు కప్పు పుదీనా ఆకుల్ని, అర అంగుళం అల్లాన్ని, అరకప్పు నీటిని కలిపి మిక్సీ పట్టండి. ఇందులోనే 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. అంతే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఎంజాయ్ చేయడమే.


ఉసిరికాయ రైస్


ఉసిరికాయతో మనం చక్కగా అన్నం కూడా వండొచ్చు. దీనికోసం పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో అర టీస్పూన్ ఆవాలు, కరివేపాకులు వేసి వేయించాలి. అందులోనే పల్లీలు వేసి వేయించాలి. తర్వా పావు కప్పు ఉసిరి తురుము కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు కప్పు ఉడికించిన అన్నం వేయాలి. మీకు నచ్చితే కొద్దిగా బెల్లం పొడి వేయండి. అంతే, చక్కని ఉసిరి రైస్ రెడీ అయినట్లే. దీనిని మీరు లంచ్ బాక్స్‌లో సర్వ్ చేయొచ్చు.


ఉసిరితో జామ్


పిల్లలకి జామ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో పంచదార బదులు బెల్లం కలిపి చేయొచ్చు. దీంతో పోషకాలు ఎక్కువగా అందుతాయి. దీనికోసం ముందుగా ఓ కప్పు ఉసిరి తురుముని ముప్పావు కప్పు బెల్లం పొడి, పావు కప్పు నీటిని అన్నింటినీ కలిపి సిమ్‌లో పెట్టి వేడి చేయాలి. ఇవన్నీ దగ్గరికి వచ్చి పేస్టులా తయారవుతుంది. ఇందులోనే మనం యాలకుల పొడి వేయాలి. అన్నింటిని బాగా కలపాలి. తర్వాత చల్లారక ఏయిర్‌టైట్ కంటెయినర్‌లో వేసి చల్లని ప్రదేశంలో స్టోర్ చేయండి. దీనిని మనం రోటీ, టోస్ట్, పరాఠాలతో ఇవ్వొచ్చు.


ఉసిరితో క్యాండీ


క్యాండీస్ అంటే పిల్లలకి ఎప్పుడు ఇష్టమే. అలాంటప్పుడు ఉసిరితో క్యాండీస్ చేయొచ్చు. దీనికోసం ఉసిరికాయల్ని ఉడికించండి. తర్వాత చల్లారక వాటి గుజ్జుని తీసి మెత్తగా చేయండి. దీనిని కడాయిలో వేసి మంటని సిమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. తర్వాత అందులో మీ రుచికి సరిపడా బెల్లం పొడి లేదా ఖర్జూరాల పొడి వేయండి. కొద్దిగా ఉప్పు, 1, 2 టీస్పూన్ల నిమ్మరసం వేయండి. ఆగకుండా కలుపుతూనే ఉండండి. తర్వాత 1 టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. ఇప్పటికే పాన్‌‌కి అంటుకోకుండా ఉంటుంది. దీనిని ఓ నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి పరవండి. తర్వాత కాస్తా వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేయండి. 2, 3 గంటల తర్వాత సెట్ అయిపోతాయి. వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్‌లో వేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి.

Latest News
United Cup: De Minaur, Swiatek win as Poland on verge of quarterfinals Fri, Jan 09, 2026, 04:47 PM
Union Minister Scindia reiterates commitment to farmers, rural women Fri, Jan 09, 2026, 04:45 PM
WPL Speed Queen - an initiative aiming to increase India women's fast bowling pool Fri, Jan 09, 2026, 04:41 PM
NHAI unveils new initiatives to create future professionals Fri, Jan 09, 2026, 04:38 PM
EU leaders meet Syrian President al-Sharaa in Damascus Fri, Jan 09, 2026, 04:37 PM