|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:43 PM
గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయం, వినియోగానికి పాల్పడుతున్న నలుగురు విక్రేతలు, 10 మంది వినియోగదారులతో సహా మొత్తం 14 మందిని పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4.95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పెదకాకాని గ్రామంలోని పిహెచ్‌సీ సమీపంలో పాడుబడిన షెడ్‌లో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గంజాయి, అసాంఘిక శక్తుల రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దేందుకు కార్డన్ సెర్చ్‌లు, ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
Latest News