|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 09:11 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపాయి. తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేశారని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నా మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశార అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వివాదంపై స్పందించారు. కృష్ణా జలాల విషయంలో అసలు ఏం జరిగిందో త్వరలోనే మీడియా ద్వారా అన్ని వాస్తవాలు వివరిస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబు వివరణ తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Latest News