|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 09:14 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని సాయిబాబా నివాసానికి వెళ్లారు. సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి సాయిబాబా స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. చివరి శ్వాస వరకు పార్టీకి విధేయుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా సాయిబాబా చేసిన సేవలను ఆయన కొనియాడారు. సాయిబాబా కుటుంబం సమస్యల్లో ఉందని తెలిసిందని, వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Latest News