|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:33 PM
శివాలయాల్లో నందీశ్వరుడు ఎల్లప్పుడూ శివుడి వైపే చూస్తుండటం వెనుక ఆధ్యాత్మిక అర్థం ఉందని పండితులు చెప్తున్నారు. ఇది ఏకాగ్రత, అచంచల భక్తి, సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా భావిస్తారు. ద్వారపాలకుడైన నంది మనసు చంచలంగా కాకుండా దైవచింతనలో స్థిరంగా ఉండాలని భక్తులకు బోధిస్తాడు. శివుడు నిరంతరం తపస్సులో లీనమై ఉంటారని విశ్వాసం. అందుకే భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తే, ఆయన అవి శివుడికి చేరవేస్తాడని నమ్మకం.
Latest News