|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:35 PM
ఎమ్మిగనూరులోని శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సాయంత్రం జరిగే రథోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Latest News