|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:27 PM
వ్యవసాయంతో పాటు రైతులు వ్యాపారులుగా మారాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు రైతులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో సోమవారం జరిగిన రైతు నేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఫౌండేషన్ నిర్వాహకులు యడ్లపల్లి వెంకటేశ్వర రావుకు, రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రైతులు కేవలం పంట పండించడమే కాకుండా వ్యాపార దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
Latest News