|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:40 PM
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలపై వివాదం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరైనా, హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2020లోనే ఆగిపోయిందని, అనుమతులు లేకుండా పనులు చేపట్టడమే దీనికి కారణమని ఆయన గుర్తు చేశారు. రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలకు తెలుసునని, అందుకే కూటమికి పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
Latest News