|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:50 AM
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వివాదం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నదీ జలాల వివాదాలు కోర్టుల్లో తేలే అంశాలు కావని అన్నారు.ఈ అంశంలో రాజకీయంగా పైచేయి కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగ ప్రకటనలకు దిగకూడదని ఆయన సూచించారు. పరస్పర సమన్వయంతో నాలుగు గోడల మధ్య కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలన్నారు.అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని, ఒక స్పష్టమైన స్వరూపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుపడేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన హితవు పలికారు.
Latest News