|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 03:59 PM
AP: మార్కాపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామానికి చెందిన సారమేకల హరి (53) అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్య లక్ష్మీదేవీతో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య లక్ష్మీ తన కుమార్తెలతో కలిసి.. భర్త హరిని కర్రతో కొట్టి హత్య చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News