|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:25 PM
ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని సదర్లాండ్ దక్కించుకుంది. సదర్లాండ్ 736 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, దీప్తీ శర్మ 735 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దీప్తీ శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13వ ర్యాంక్‌కు చేరుకుంది.
Latest News