|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:36 PM
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నాడు. ఈ నెల 9వ తేదీన ఆయన రాజధాని అమరావతికి రానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ధోని ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఆధునిక క్రికెట్ అకాడమీని ఏపీలో ఏర్పాటు చేసే విషయంపై వీరిద్దరి మధ్య సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది.
Latest News