|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:40 PM
ఏపీ పోలీసు వ్యవస్థపై వైసీపీ నాయకురాలు, మాజీమంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అట్టడుగుస్థాయిలో ఉందన్నారు. కేంద్రం విడుదల చేసిన నివేదిక చూసి హోమంత్రి, సీఎం సిగ్గుపడాలని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు తెలుగుదేశం పార్టీ చెప్పింది చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ తానా అంటే పోలీసులు తందానా అంటున్నారని, అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని ఆమె విమర్శించారు.
Latest News