|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:38 AM
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.600 ఎగబాకి రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర ఒక్కరోజే రూ.12,000 పెరిగింది. దీంతో కిలో వెండి రేటు రూ. 2,83,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Latest News