|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:15 AM
ఏపీలోని విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నగర శివార్లలోని ఎండాడ హిల్స్ లో ఈ భూమిని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ప్రతినిధులు భూములను పరిశీలించారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ ఏర్పాటు కావడం కీలక మైలురాయిగా భావిస్తున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఇప్పటికే విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.
Latest News