|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:29 AM
ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడితో చాలామంది రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం తొందరగా లేవడానికి అలారం పెట్టుకుంటున్నారు. అయితే వైద్యుల ప్రకారం అలారం మోతతో గాఢ నిద్ర నుంచి ఒక్కసారిగా మేల్కోవడం వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఇది హార్ట్ బీట్, బీపీ పెంచి, తీవ్రమైన తలనొప్పి, చికాకు, మానసిక సమస్యలకు దారితీస్తుంది. సరైన నిద్రలేమి వల్ల పనులు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యలను నివారించడానికి, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి నిద్రలేచే అలవాటు చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Latest News