|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:23 PM
పశ్చిమ బెంగాల్ లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ కోసం చేపట్టిన సర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సర్వేలో భాగంగా విచారణకు రావాలంటూ ఎన్నికల సంఘం పలువురు ఓటర్లకు నోటీసులు పంపింది. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కు కూడా ఈ నోటీసులు పంపడం వివాదాస్పదంగా మారింది. నోబెల్ గ్రహీతకు నోటీసులు పంపడంపై అధికార టీఎంసీ ఎంపీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం అమర్త్యసేన్ సొంత జిల్లా బీర్భూమ్ లో నిర్వహించిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీ ఆరోపణలపై ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు వెంటనే స్పందించారు. అమర్త్యసేన్ కు నోటీసులపై మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అమర్త్యసేన్ పేరు విషయంలో చోటుచేసుకున్న స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా సిస్టం నోటీసులు పంపిందని, స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేయాలని బూత్ లెవెల్ అధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
Latest News