|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:26 PM
వీధి కుక్కల బెడదపై బుధవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క కరిచే మూడ్‌లో ఉన్నప్పుడు దాని మనసును చదవలేమని, చికిత్స కంటే నివారణే ఉత్తమమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతేడాది నవంబర్ 7న ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లలో కుక్కల బెడద లేకుండా చూడాలని, స్టెరిలైజేషన్, టీకాల తర్వాత వాటిని షెల్టర్లకు తరలించాలని, తిరిగి పట్టుకున్న స్థలాల్లో విడిచిపెట్టొద్దని ఆదేశించింది. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారుల నుంచి అన్ని పశువులు, వీధి జంతువులను తొలగించాలని అధికారులను ఆదేశించింది.
Latest News