|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 02:15 PM
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య మిలిటరీలో చేరారు. సింగపూర్‌లో రెండేళ్ల పాటు ప్రాథమిక సైనిక శిక్షణ తీసుకోనున్నట్లు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ శిక్షణలో ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన వారిని రిజర్వ్ దళాలుగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా లాలూ కుటుంబం విడిపోయిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోహిణి తన కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. రోహిణి కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది.
Latest News