|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 02:36 PM
విశాఖ జిల్లా బక్కన్నపాలెంలో భర్త నాగరాజుఅదృశ్యం కేసులో పోలీసులు సంచలన నిజాలను వెలికితీశారు. భార్య రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తిమ్మాపురంలో కుళ్లిన స్థితిలో లభించిన మృతదేహం నాగరాజుదేనని గుర్తించారు. విచారణలో, భార్య రమ్య తన ప్రియుడితో కలిసి నాగరాజును హత్య చేసినట్లు తేలింది. ఈ హత్యలో ప్రియుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు.
Latest News