|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 02:42 PM
పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన యాపమాను విజయలక్ష్మి క్లాట్-2026 పరీక్షలో ప్రతిభ కనబరిచి, విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో సీటు సాధించారు. ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 4808, ఓబీసీ ర్యాంక్ 699, ఏపీ జనరల్ ర్యాంక్ 61 సాధించింది. నంద్యాలలో అడ్వకేట్‌గా పనిచేస్తున్న పెద్దస్వామి, వీఆర్వో లక్ష్మీదేవిల కుమార్తె అయిన విజయలక్ష్మిని నారా భువనేశ్వరి, సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
Latest News