|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 06:21 PM
యూపీలోని హాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు భారీ మొత్తంలో నకిలీ తేనెను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్న 140 క్వింటాళ్లకు పైగా తేనె ఉన్న 500 డ్రమ్ములను అధికారులు సీజ్ చేశారు. తేనెకు రంగు, తీపిని జోడించడానికి సీరమ్ కలిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ తేనెను హర్యానా నుండి సేకరించి, హాపూర్‌లోని గిడ్డంగి నుండి ఏపీకి తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరిన్ని పరీక్షల కోసం నమూనాలను ప్రయోగశాలకు పంపారు.
Latest News