|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 06:23 PM
గ్రీన్ ల్యాండ్ ను తమ దేశంలో కలపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం గట్టిగా నిర్ణయించుకుంది. తమ జాతీయ భద్రతకు ఇది అవసరమని పునరుద్ఘాటిస్తూ, గ్రీన్ ల్యాండ్ పై నియంత్రణకు సైనిక చర్యతో సహా అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి స్పష్టం చేశారు. 20 రోజుల్లోపు ఏదో ఒక చర్య ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను పట్టుకోవడంతో, అమెరికా అధికారులు వెనెజులా సెక్యూరిటీ చీఫ్ డియోస్టాడో కాబెల్లోపై దృష్టి సారించారు. సహకరించకపోతే మదురోలాగే కష్టాలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. వెనెజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినోపైనా అమెరికా నిఘా పెట్టింది.
Latest News