|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:19 PM
మలబద్ధకాన్ని కేవలం చిన్న అసౌకర్యంగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీర 'మురుగునీటి వ్యవస్థ' ఆగిపోవడమే. పేగుల్లో మలం ఎక్కువసేపు పేరుకుపోవడం వల్ల విషతుల్యాలు రక్తంలో చేరి అలసట, చర్మ సమస్యలు, తలనొప్పి వస్తాయి. నిరంతర ఒత్తిడితో పేగు కండరాలు బలహీనపడి పైల్స్, ఫిషర్స్ వంటివి వస్తాయి. మంచి బ్యాక్టీరియా నశించి గ్యాస్, ఉబ్బరం పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యం బారిన పడతారు.
Latest News