|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 12:07 PM
దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు జారీ చేసింది. ఇకపై స్థానిక, మాన్యువల్ బాడీ బిల్డర్లకు స్లీపర్ బస్సులు తయారు చేసేందుకు అనుమతి ఉండదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. కేవలం గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు, తయారీ సంస్థలు మాత్రమే స్లీపర్ బస్సులను నిర్మించగలవని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Latest News