|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 12:04 PM
బాపట్ల జిల్లా చిరకాలవారిపాలెం గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీకి చెందిన ఒక బస్సు రోడ్డుపై మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బస్సు చెరువులోకి వెళ్లడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Latest News