|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:52 AM
కోనసీమ సంస్కృతికి ప్రతీకగా నిలిచే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొసలపల్లి శివారులోని జగ్గన్నతోటలో ప్రతి ఏడాది మకర సంక్రమణ సమయంలో జరిగే ఈ వేడుకలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సందర్భంగా 11 గ్రామాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
Latest News