|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 02:17 PM
ఏపీ జాతీయ రహదారి నిర్మాణంలో రెండు గిన్నిస్ రికార్డులు సాధించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ బెంగళూరు–కడప–విజయవాడ హైవే (ఎన్‌హెచ్–544జీ)లో 24 గంటల్లో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి రికార్డు నెలకొల్పింది. అలాగే అదే సమయంలో 28.95 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి, నితిన్ గడ్కరీ నాయకత్వంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రహదారులు నిర్మితమవుతున్నాయని సీఎం ప్రశంసించారు.
Latest News