|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 02:15 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా అర్హులైన పేదలకు నాణ్యమైన నివాసాలు అందిస్తున్నామని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నరసరావుపేట పట్టణ శివారులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో (TIDCO) గృహాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ గృహాలను కేసనపల్లి రోడ్డులోని టిడ్కో హౌసెస్ వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా పంపిణీ చేశారు.
Latest News