|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:33 PM
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు (Tirumala Laddu Ghee Adulteration Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు స్వయంగా అంగీకరించారు. నెయ్యిని సరఫరా చేసిన కంపెనీలు కల్తీకి పాల్పడ్డాయని, వాటికి అనుకూలంగా వ్యవహరించినందుకు తాను లంచం స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు.డెయిరీ నిపుణుడిగా పనిచేసిన విజయభాస్కర్ రెడ్డి, నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేయరాదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన వాదనలు వినిపించారు.ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న నెల్లూరు ఏసీబీ కోర్టు, విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
Latest News