|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 09:11 PM
Rain Forecast for Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం చలి తీవ్రతతో గజగజ వణికిపోతున్నాయి. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకకు సమీప ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది.ఈ తీవ్ర వాయుగుండం జనవరి 10వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ–జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటిన అనంతరం కూడా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగి, రెండు రోజుల పాటు వర్షాలు కురిసే పరిస్థితులు ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Latest News