|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:39 AM
కేంద్ర బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘ప్రి బడ్జెట్’ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండగా, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యాలపై చర్చ జరగనుంది.
Latest News