|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:29 AM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు చరమగీతం పాడారని, ఈ నిర్ణయం వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని విమర్శించారు. సోమశిలను సందర్శించకుండా తమను హౌస్ అరెస్ట్ చేయడం, గొంతు నొక్కే ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ను టీడీపీ నేతలు ఖండించకపోవడం దారుణమని, చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాయలసీమ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలించి మెట్ట ప్రాంతానికి నీరు ఇవ్వాలని తెలిపారు.
Latest News