|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:31 AM
APలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పట్టణాలు, పల్లెలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అతిథులకు ఆతిథ్యమివ్వడంలో ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాల్లో కోడి పందేలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో భీమవరం, పరిసర ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లలో గదులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.
Latest News