|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:00 PM
AP: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, ఇతర శాస్త్రవేత్తలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల 19 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన కోసం ఈఓఎస్-N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మైక్రో శాటిలైట్ లను ప్రయోగిస్తున్నామని, గత ఏడాది పీఎస్ఎల్వి ప్రయోగంలో ఏర్పడిన అవరోధాలను అధిగమించి ఈసారి ప్రయోగాన్ని చేపడతామని ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 12 గంటల 19 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందని చెప్పారు.
Latest News