|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:01 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజల రద్దీతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో, సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీని ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Latest News