|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:36 PM
AP: YS జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, చంద్రబాబు ఇప్పటికీ అక్రమంగా కట్టుకున్న నివాసంలోనే ఉంటున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు తీస్తున్నారని, రేవంత్ రెడ్డి మాటలకు చంద్రబాబు నుంచి సమాధానం లేదని విమర్శించారు. జగన్ అమరావతిపై చాలా ప్రశ్నలు సంధించారని, రాజధాని నిర్మాణం కోసం తొలిదశలో 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదని, రైతులకు ఇస్తున్న రిటర్న్స్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆయన పేర్కొన్నారు.
Latest News