|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 02:49 PM
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కి వర్తించే వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000 వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, లక్షలాది మంది మధ్యస్థ వేతనాలు పొందే ఉద్యోగులకు అదనపు భద్రత, పెన్షన్ ప్రయోజనాలు లభించే అవకాశముంది. ప్రభుత్వం కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Latest News