|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 08:50 PM
తిరుమలలో భక్తురాలికి మత్తుమందు ఇచ్చి తాళిబొట్టు చైన్ చోరీ చేసిన కేసులో వన్‌టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. చైన్ చోరీకి పాల్పడ్డ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నెల 2వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి చెందిన విజయ (63) అనే వృద్ధురాలు తిరుమలకు చేరుకుంది. 2వ వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 20వ కంపార్ట్‌మెంట్‌లో దర్శనం కోసం వేచి ఉండగా, అదే సమయంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి 57 గ్రాముల బరువున్న తాళిబొట్టు చైన్‌ను దుండగురాలు చోరీ చేసింది.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక విశ్లేషణతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, కర్ణాటకకు చెందిన నాగిశెట్టి నాగరత్నమ్మగా నిందితురాలిని గుర్తించారు.నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి 57 గ్రాముల బరువున్న బంగారు తాళిబొట్టు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
Latest News