భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తుపాకీ ఫోటోతో అత్తగారి రివర్స్ ఎటాక్
 

by Suryaa Desk | Fri, Jan 23, 2026, 09:16 PM

భార్యాభర్తల గొడవలు అంటే సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని ఘటనలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాయి. కానీ భార్యాభర్తల మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రోజూ తాగి వస్తున్నాడని భర్తను భార్య బెడ్రూంలో మంచానికి కట్టేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే తన కుమారుడిని.. తన కోడలు హింసిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆమె బెదిరిస్తోందని.. కోడలు తుపాకీ పట్టుకుని ఉన్న ఫోటోను కూడా పోలీసులకు సమర్పించింది. దీంతో అసలు ఏం జరిగిందో తేల్చే పనిలో పోలీసులు పడ్డారు.


అలీగఢ్‌లోని హమీద్‌పూర్ గ్రామంలో ప్రదీప్ అనే వ్యక్తి నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య సోని.. బుధవారం రాత్రి ప్రదీప్‌ను మంచానికి గట్టిగా తాళ్లతో కట్టేసింది. ఆ సమయంలో ఆమె గొడవ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ప్రదీప్ తల్లి అక్కడికి చేరుకుని అతడిని విడిపించారు.


కోడలి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అత్త, ప్రదీప్ తల్లి టప్పల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. కేవలం తన కుమారుడిని మంచానికి కట్టేయడమే కాకుండా.. , తన కోడలి వద్ద ఒక నాటు తుపాకీ ఉందని కూడా ఫిర్యాదు చేసింది. ఆ తుపాకీని చూపించి చంపేస్తానని ఎప్పుడూ బెదిరిస్తోందని ఆరోపించింది. దీనికి సాక్ష్యంగా కోడలు తుపాకీ పట్టుకున్న ఒక ఫోటోను కూడా పోలీసులకు అందజేసింది.


అయితే ఈ ఘటనలోకి ఎంటర్ అయిన పోలీసులు.. సోనిని విచారణ చేయగా.. ఆమె మరోలా స్పందించింది. తన భర్త తాగి వచ్చి తననే కాకుండా ఇరుగుపొరుగు వారిని కూడా వేధిస్తున్నాడని.. ఆ గొడవ ఆపడానికే అతడిని కట్టేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, అత్తగారి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. వైరల్ వీడియోతోపాటు.. సోని తుపాకీ పట్టుకున్న ఫోటోను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సోనిని స్టేషన్‌కు పిలిపించి విచారణ ప్రారంభించారు. ఒకవేళ ఆమె వద్ద అక్రమంగా తుపాకీ ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Latest News
Pakistan: Aurat March leaders accuse police of 'manhandling' protesters, demand probe Tue, Mar 10, 2026, 04:29 PM
Fair tax system fosters inclusive growth: President Murmu Tue, Mar 10, 2026, 04:27 PM
Pakistan's ISI targetting Chinese investment projects in Afghanistan, warns expert Tue, Mar 10, 2026, 03:35 PM
PM Modi to visit Assam; HM Shah to address mega BJP youth conference Tue, Mar 10, 2026, 03:20 PM
BJP flags doctors' strike threat in Assembly; Karnataka govt assures of talks soon Tue, Mar 10, 2026, 03:15 PM