జలుబు + దగ్గు + కఫం 3 సమస్యల్ని వదిలించే సింపుల్ చిట్కా
 

by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:20 PM

చలికాలంలో చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలు కొన్ని ఉన్నాయి. జలుబు, దగ్గు, గొంతులో కఫం పేరుకుపోవడం శీతాకాలంలో వచ్చే అత్యంత సాధారణ సమస్యలు. చల్లని గాలి, తక్కువ ఇమ్యూనిటీ పవర్, ఆకస్మిక వాతావరణ మార్పులు శ్లేష్మం ఉత్పత్తికి కారణమవుతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. వీటితో పాటు శ్వాస ఆడకపోవడం, ఛాతీలో కఫం, భారంగా అనిపించడం వంటి సమస్యలు అదనం. మందులు వాడినా జలుబు, దగ్గు అంత త్వరగా తగ్గవు.


జలుబు, దగ్గు చికిత్సకు పెద్దలు కొన్ని ఇంటి చిట్కాలు చెబుతుంటారు. అలాంటి ఓ చైనీస్ చిట్కా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఉల్లిపాయదే ప్రధాన పాత్ర. ఈ చిట్కాను పాటిస్తే గొంతులో పేరుకుపోయిన కఫం క్లియర్ అవుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఈ చిట్కాతో శరీరం యొక్క సహజ వైద్యం ప్రక్రియకు మద్దతు ఇస్తుందని నమ్ముతున్నారు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, దీన్ని ఎలా ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


​ఎర్ర ఉల్లిపాయ - ఒకటి


నీరు - 2 కప్పులు


ఆలివ్ ఆయిల్ - ఒక టీ స్పూన్


తేనె - ఒక టీ స్పూన్


తయారీ విధానం ఏంటో చూడండి


​ఇందుకోసం ముందుగా ముందుగా 1 మీడియం ఎర్ర ఉల్లిపాయను కోసి.. 2 కప్పుల నీటిలో మరిగించాలి.


నీరు సగానికి తగ్గినప్పుడు, దానిని వడకట్టండి.


ఇప్పుడు దానికి 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ ఆలివ్ నూనె కలపండి.


గోరువెచ్చగా అయినప్పుడు నెమ్మదిగా తాగండి.


ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


ఇది ఎలా పనిచేస్తుంది?


ఎర్ర ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శ్లేష్మాన్ని పలుచగా చేసి బయటకు పంపుతాయి. తేనె గొంతు మంటను తగ్గిస్తుంది. అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక, ఆలివ్ నూనె వాయుమార్గాలను క్లియర్ చేస్తుంది. కఫాన్ని తేలికపర్చి బయటకు పంపడంలో సాయపడుతుంది. దీంతో గొంతులో చికాకు, నొప్పి తగ్గుతుంది.


ప్రయోజనాలపై ఓ లుక్కేయండి


ఇది గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని విచ్చిన్నం చేయడంలో సాయపడుతుంది.


దగ్గు, జలుబు, కఫం ఈ మూడు సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తుంది.


ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సాయపడుతుంది.


రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరం యొక్క సహజ వైద్యం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.


ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు అంటున్నారు. అయితే, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.


దాల్చిన చెక్క కూడా మంచి పరిష్కారం


గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో దాల్చిన చెక్క చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో క్రిమినాశక, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు వాపును తగ్గిస్తాయి. బ్యాక్టీరియాను చంపుతాయి. ఇందుకోసం దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగాలి. ఛాతీలో పేరుకుపోయిన కఫం తొలగించడానికి, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా కొన్ని చిన్న దాల్చిన చెక్కలను తీసుకొని 250 మి.లీ నీటిలో 5 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత దానిని వడకట్టి గోరువెచ్చగా తాగండి.

Latest News
Fuel and food supplies to Balochistan face disruption due to Israel-Iran conflict Sun, Mar 08, 2026, 05:40 PM
Juvenile among two held in Punjab; five country-made pistols seized Sun, Mar 08, 2026, 05:37 PM
Middle East tensions to shape Indian stock market sentiments this week Sun, Mar 08, 2026, 05:33 PM
Man killed, wife, son injured in MP road accidentMan killed, wife, son injured in MP road accident Sun, Mar 08, 2026, 04:58 PM
'Disrespect to Constitution', PM Modi calls out Trinamool govt's 'dirty politics' over Prez Murmu venue change Sun, Mar 08, 2026, 04:56 PM