|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:53 AM
జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ హత్య చేయించిన భార్య. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చెందిన శ్రీను ఇటీవల గంజాయి కేసులో జైలుకు వెళ్లడంతో బెయిల్ ఇప్పించిన అతని భార్య ఝాన్సీ, కిరాయి హంతకులతో అతడిని హత్య చేయించింది.శ్రీను జైలుకు వెళ్లే ముందే తన భార్యతో వివాహేతర సంబంధానికి సంబంధించి తరచూ గొడవ పడేవాడు.తన భర్తతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన ఝాన్సీ, జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి బయటకు రాగానే రూ. 2 లక్షల సుపారీ ఇచ్చి, తన తమ్ముడి సహకారంతో భర్తను కిరాతకంగా హత్య చేయించింది.
Latest News