ఆవు దూడను ఊరవతలకి తీసుకెళ్లి లైంగిక దాడి
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 07:51 PM

నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఘటనల్లో కొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఇంకొన్ని ఇలాంటి వ్యక్తుల మధ్య, ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా అనే భయానికి కారణమవుతాయి. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఇలాగే ఆందోళనకు కారణమవుతోంది. ఈ రోజులలో మనుషులకే కాదు.. పశువులకు కూడా రక్షణ లేదా అనేలా ఈ ఘోరం చోటుచేసుకుంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే రీతిలో.. ఓ గోమాతపై లైంగిక దాడి జరిగింది. నోరులేని ఓ మూగజీవిపై మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. నీతిమాలిన, నీచమైన పనికి పాల్పడటమే కాకుండా.. ఈ దారుణ కాండను వీడియో తీసి మిగతావారితో పంచుకోవటం.. వారి మానసిక స్థితి ఎలా ఉందనే దానికి అద్దం పడుతోంది.


అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోటలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఐదారు రోజుల కిందట జరిగినట్లు సమాచారం. గ్రామానికి చెందిన నలుగురు మైనర్లు.. ఓ ఆవు దూడను ఊరవతలకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అందులో ఒక బాలుడు ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడగా.. మరో బాలుడు వీడియో తీశాడు. ఈ సమయంలో మరో ఇద్దరు మైనర్లు అక్కడే ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం ఈ వీడియోనూ ఊర్లోని తమ స్నేహితులకు షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.


దీంతో ఈ విషయం బురకాయలకోట ఊరిజనంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. ఈ నేపథ్యంలో ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు శుక్రవారం రోజున ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించి విచారిస్తు్న్నారు. ఈ ఘటనతో బురకాయలకోట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. గోమాతను దేవతగా పూజించే మనదేశంలో ఇలాంటి దారుణం ఏమిటని మండిపడుతున్నారు. తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పేనని ఆవు దూడపై అఘాయిత్యానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Latest News
MP LoP slams state govt over agriculture policy Mon, Mar 02, 2026, 04:50 PM
Kuwait confirms several US military aircraft crashed, all crew safe Mon, Mar 02, 2026, 04:05 PM
T20 WC: When and where to watch India vs England semifinal Mon, Mar 02, 2026, 03:44 PM
India, Canada decide to establish defence dialogue, says PM Modi Mon, Mar 02, 2026, 03:10 PM
Nepal: PM Karki calls voters to actively participate in March 5 elections Mon, Mar 02, 2026, 03:06 PM