ఆ మంత్రి నా పేరేంటి అని అడిగారు.... బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:13 PM

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఆదినారాయణ రెడ్డి.. ఆ తర్వాతి కాలంలో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆదినారాయణరెడ్డి. 2024లో ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గురించి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


"కొత్త ఎమ్మెల్యేలకు కనీస అవగాహన జరగాలి. కొంతమంది మంత్రులు కూడా లోతైన పరిశోధన చేయాలి. ఈ విషయంపై సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేస్తు్న్నట్లు ఓపెన్ డిబేట్లలో వస్తోంది. గిగ్ ఆర్డర్ల గురించి కార్మిక మంత్రికి నేనే చెప్పా. ఆ మంత్రి మీ పేరేంటి సార్ అని అడిగారంట నిజమేనా..(యాంకర్)అతనికి చాలా మంది గురించి వ్యక్తిగతంగా తెలియదు. అందుకే తెలుసుకోమని చెప్పా. రెగ్యులర్‌గా అసెంబ్లీకి రమ్మని చెప్పా. నన్ను కనుక్కోకపోయినా పర్లేదు. చాలామందిని కనుక్కో. వ్యక్తిగతంగా తెలుసుకో అని సలహా ఇచ్చా. కొంచెం మెచ్యూరిటీ రావాలని సలహా ఇచ్చా."


" సీరియస్ లేకుండా సీరియల్‌గా నడిపితే ఇలానే ఉంటుంది. సీరియస్‌గా నడిపితే వేరేలా ఉంటుంది. ఆయన మీ పేరేంటని అడిగే సరికి.. ఇదేం ఖర్మా అనుకున్నా. పక్కనున్న ఆయన.. అంతేసార్ ఈయన, ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చారు, ఏం చెప్పాలా అని అన్నారు. నన్ను మాత్రమే కాదు ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులును కూడా కనిపెట్టలేకపోయారు. చీఫ్ విప్‌ను అతనెవరు అని అడిగారు. నేనంటే వాళ్ల పార్టీ కాదు. కనీసం టీడీఎల్పీలో కూర్చున్నప్పుడు అయినా విప్, మంత్రుల దగ్గరే ఉంటాడు. అతను తెలియకపోతే ఎలా" అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Latest News
Muslim clerics condemn killing of Khamenei, call for peace Sun, Mar 01, 2026, 03:41 PM
All employees safe, operations normal at Haifa Port: APSEZ Sun, Mar 01, 2026, 03:36 PM
Indian ice hockey team stranded in Mumbai after flight cancellations amid West Asia tensions Sun, Mar 01, 2026, 03:27 PM
Iran's armed forces chief of staff killed: State media Sun, Mar 01, 2026, 03:22 PM
IDF shares how Khamenei was killed in heart of Tehran Sun, Mar 01, 2026, 03:15 PM