|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:28 PM
సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరిగే ఖర్చుల ఇన్‌వాయిస్‌లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన రహస్య జీవోలను బయటపెట్టాలని వైయస్ఆర్‌సీపీరాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు మేలు చేస్తారనే ఆశతో ప్రజలు కూటమికి పట్టంగడితే విచ్చలవిడి దుబారా ఖర్చులు, జల్సాలతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ, ఏ బిజినెస్ మ్యాన్ కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు మాదిరిగా హైదరాబాద్ నుంచి షటిల్ సర్వీసులు చేయరని, ఏపీలో మంత్రి పదవులు వెలగబడుతూ వారం వారం హైదరాబాద్‌లో ఏం పని ఉంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విమాన ప్రయాణాలకు ఏడాదిలో రూ. 56 కోట్లు ఖర్చు చేశారని జీఏడీ వెల్లడించిందని, అంతకన్నా ఎక్కువగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ఎంత ఖర్చు అయ్యుంటుందని ప్రశ్నిస్తూ, వారికి ఆ డబ్బులు ప్రభుత్వం కాక ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Latest News