|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:29 PM
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో 15 సార్లు దావోస్ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు.. తెచ్చిన పెట్టుబడులు కన్నా ఎక్కువ ఖర్చులు పెట్టిన ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కుతాడని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ విమర్శించారు. శనివారం అనంతపురం లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దావోస్ పర్యటనల ద్వారా చేసుకున్న ఒప్పందాలు, అందులో కార్యరూపం దాల్చిన కంపెనీల వివరాలు, తద్వారా కల్పించిన ఉద్యోగాల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు చంద్రబాబు దావోస్ ఖర్చుల లెక్కలను మీడియా ముందుంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు సాధించలేని పారిశ్రామిక ప్రగతిని ఐదేళ్ల తన పాలనలో వైయస్ జగన్ గారు సాధించి చూపారని కేంద్ర గణాంకాలే రుజువు చేస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నిందితులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేసి వేధిస్తున్న దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం, పోలీసుల తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. చట్టాలను ఉల్లంఘించి మానవ హక్కులను కాలరాస్తూ అమాయకులను వేధిస్తున్న భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ హెచ్చరించారు.
Latest News