|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:32 PM
మళ్లీ వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డా" ఆదిమూలపు సతీష్ ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారికి గుర్తింపు కల్పించాలన్నదే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలబడాలన్న సంకల్పంతోనే ఈ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అమలు చేస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” ద్వారా అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం అవసరమని అన్నారు. పంచాయతీ, గ్రామ స్థాయిలో కమిటీలను త్వరిగతిన పూర్తి చేసి, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో పార్టీని మరింత పటిష్టం చేసి, రానున్న రోజుల్లో వైయస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ,వార్డు,మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఉత్సాహవంతులు, పార్టీ కోసం పనిచేసే సమర్థులైన నాయకులందరికీ సముచితమైన అవకాశాలు కల్పిస్తూ గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 2029 లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం జిల్లా పార్టీ నాయకులు, జిల్లా అనుబంధ నాయకులు, నియోజవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండలాల కన్వీనర్లు, మండలాల అనుబంధాల విభాగ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Latest News