ఎంపీ ల్యాడ్స్ నిధులతో గిరిజన ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పనులు ప్రారంభించిన వైసీపీ ఎంపీ తనూజ రాణి
 

by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:34 PM

అల్లూరి జిల్లా, డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ (జైపూర్ జంక్షన్)లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మాణానికి శ‌నివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జగనన్న హయాంలో నాడు–నేడు పథకం ద్వారా సుందరంగా అభివృద్ధి చేయబడిన ఈ ఆశ్రమ పాఠశాలలో, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు అరుకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి గారి ఆదేశాల ప్రకారం ఎంపీ ల్యాడ్స్  నిధులు రూ.20 లక్షలతో ఈ సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మాణం చేపట్ట‌నున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డుంబ్రిగుడ మండల ఎంపీపీ,జడ్పీటీసీ   బాకా ఈశ్వరి ,  చటారి జానకమ్మ  , మండల వైస్ ఎంపీపీ  శెట్టి ఆనందరావు , మండల   పార్టీ అధ్యక్షులు పాంగి పరశురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

Latest News
Maha govt set to widen enforcement of plastic flower prohibition Fri, Feb 27, 2026, 04:46 PM
Pakistan: Minority rights group flags brutal attack on Christian worker Fri, Feb 27, 2026, 04:37 PM
Report reveals 26.2 million children remain out of school in Pakistan Fri, Feb 27, 2026, 04:22 PM
Bengal Oppn parties hold Mamata Banerjee as much responsible as BJP for SIR 'flaws' Fri, Feb 27, 2026, 04:12 PM
My heartfelt prayers are with you: Kohli offers condolences after Rinku Singh's father demise Fri, Feb 27, 2026, 04:06 PM