|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 12:35 PM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను కూటమి ప్రభుత్వం రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడం పై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్సిటీలో టీడీపీ కార్యకర్తలు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... విద్యార్ధులను భయబ్రాంతులకు గురయ్యేంత భయంకరంగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కార్లు , బైకులతో కేడర్ ను సమీకరించి... భారీగా కేకులు కట్ చేయడాన్ని తప్పు పట్టారు. కూటమి పాలనలో ఉన్నతవిద్య పూర్తిగా నిర్వీర్యమైందని... ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్ధుల ఆకలి కేకలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వీసీల తొలగించిన కూటమి ప్రభుత్వం 19 నెలలైనా ఇంకా భర్ చేయకపోవడం దారుణమన్నారు. చివరకు పాలకమండళ్ల సమావేశం సైతం నిర్వహించకపోవడం... ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని... దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Latest News