|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:24 PM
డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనాతో వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్తే కెనడాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో కెనడాను చైనా సజీవంగా మింగేస్తుందని, ఆ దేశ జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.కెనడాను ప్రధాని మార్క్ కార్నీ ఒక 'డ్రాప్ ఆఫ్ పోర్ట్'గా (అదనపు సుంకాలను తప్పించుకునే కేంద్రం) భావిస్తే అది తప్పిదమే అవుతుందన్నారు. ఒకవేళ చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే, కెనడా నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. చైనా కెనడాను మింగేయడమే కాకుండా, వ్యాపారాలను, సామాజిక నిర్మాణాన్ని, జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
Latest News